Tirumala: అక్రమంగా శ్రీవారి లడ్డూల తరలింపు.. నలుగురి అరెస్ట్

by srinivas |
Tirumala: అక్రమంగా శ్రీవారి లడ్డూల తరలింపు.. నలుగురి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీవారి పోటులో అక్రమాలు బయటపడ్డాయి. శ్రీవారి పోటులో తయారు చేసిన లడ్డూలను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని విజిలెన్స్ అధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ వ్యవహారంలో శ్రీవారిపోటులో పని చేస్తున్న ఓ వ్యక్తితోపాటు మరో ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటు నుంచి బూందీపోటులోకి లడ్డూలను ట్రేలలోల కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపిన సమయంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. అక్కడ నుంచి లడ్డూ విక్రయ కేంద్రానికి ట్రేలు ట్రాలీల్లో తరలించి, వారికి ఇచ్చిన కౌంటర్లలో చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ కౌంటర్లలో ఇవ్వాల్సిన ట్రేల కంటే అదనంగా 10-15 ట్రేలలో లడ్డూలు వచ్చినట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించారు. ఒక ట్రేలో 50 లడ్డూలు ఉంటాయి. ఈ లెక్కన రూ.35 వేలకు పైగా విలువైన లడ్డూలను తనిఖీలు లేకుండా శ్రీవారి ఆలయం నుంచి నేరుగా లడ్డూ కౌంటర్లకు చేరినట్లు నిర్ధారించారు.

ఇదిలా ఉంటే తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. దర్శనం కోసం 36 గంటల సమయం పడుతోంది. దాదాపు రెండు కిలో మీటర్ల మేర భక్తులు బారులు తీరారు

Advertisement

Next Story

Most Viewed