Breaking: శ్రీకాళహస్తిలో దారుణం..భార్యపై భర్త యాసిడ్ దాడి

by srinivas |   ( Updated:2023-04-24 15:32:45.0  )
Breaking: శ్రీకాళహస్తిలో దారుణం..భార్యపై భర్త యాసిడ్ దాడి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త యాసిడ్ పోశారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. భార్య ఆదిలక్ష్మి ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా ఆమెను ఉద్యోగం మానేయాలని భర్త సుధాకర్ ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఆమె ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భార్యపై సుధాకర్ అనుమానం పెంచుకున్నారు. అదును చూసి ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో భార్య ఆదిలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Advertisement

Next Story