- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: బీజేపీకి గడ్డు రోజులు తప్పవ్..
దిశ గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి గడ్డు రోజులు తప్పవని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పతనం ఖాయమని కాంగ్రెస్ నేత పంటా శ్రీనివాసులు ఆరోపించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వ వైఖరీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు గూడూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో విశేష స్పందన లభించిందన్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసి అనర్హతగా ప్రకటించడాన్ని దేశంలోని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండిస్తున్నట్లు తెలిపారు. చిన్నచిన్న కారణాలకే అనర్హత వేటు వేసుకుంటూ పోతే ఇప్పుడున్న పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 90 శాతం మంది సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరికి ఉందన్నారు.