Chittoor: యాదమరిలో కాల్పులు.. వ్యక్తి పరిస్థితి విషమం

by srinivas |   ( Updated:2023-04-17 12:42:04.0  )
Chittoor: యాదమరిలో కాల్పులు.. వ్యక్తి పరిస్థితి విషమం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి చిత్తూరు జిల్లా యాదమరిలో కాల్పుల కలకలం రేపాయి. సురేశ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. కాల్పులు అనంతరం అక్కడ నుంచి దుండగులు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సురేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో ఓ ఆస్పత్రిలో సురేశ్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే రాజేంద్ర, మనోహర్, గణేష్, నాగభూషణంలు కాల్పులు జరిపారని సురేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సురేశ్‌పై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story