- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయం భయం.. అటు చిరుతలు.. ఇటు ఎలుగు బంట్లు!
దిశ ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులను ఇటు చిరుతలు... అటు ఎలుగుబంట్లు కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాంతంలో చిరుత సంచరించినట్లు అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో గుర్తించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే సంచరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈనెల 8, 9 తేదీల్లో శ్రీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి కదలికలు దొరికాయి. దీంతో దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు కొన్ని సూచనలు చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.
గతంలో అలిపిరి మెట్ల మార్గంలో పలుసార్లు చిరుతలు సంచరించాయి. కొంతకాలం క్రితం ఓ బాలుడిపై దాడి చేయగా.. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బాలిక లక్షితపై దాడి చేసి చంపేసింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ అధికారులతో కలిసి బోన్లు ఏర్పాటు చేసి ఐదు చిరుతల్ని బంధించారు. దీంతో చిరుతల బాధ తప్పిపోయిందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ తాజాగా మరో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్లు గుర్తించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.