Breaking: జగన్ ‘సిద్ధం’సభలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |
Breaking: జగన్ ‘సిద్ధం’సభలపై  చంద్రబాబు సంచలన  వ్యాఖ్యలు
X

దిశ, పీలేరు: ఐదేళ్లపాటు దోచుకున్న సొమ్ముతో ‘సిద్దం’ అంటూ జగన్ ప్రచార సభలు నిర్వహిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పీలేరు పిలుస్తోంది రా.. కదలిరాలో సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ను ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక వైసీపీ జెండా పీకేయటం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. యుద్దం ప్రారంభమైందని, దీనికి తాము సిద్దమని, జగన్ కూడా సిద్దమా? అని ప్రశ్నించారు. వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో గెలుపు టీడీపీ, జనసేనదేనని చెప్పారు. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారని, ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి అని నిలదీశారు. ‘ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? నేను రాయలసీమ బిడ్డనే నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమే’. అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీమ ప్రాజెక్టులకు రూ,12500 కోట్లు ఖర్చు చేశాం

టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశామని,ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా? అని నిలదీశారు. రాయలసీమ ద్రోహి జగన్ అని ఆరోపించారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో ప్రారంభమైనవేనని గుర్తు చేశారు. వాటిని పూర్తి చేసే బాధ్యత టీడీపీదేనన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు .టీడీపీ ఉంటే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొచ్చే వాళ్లమని, ప్రతి సంవత్సరం 2 వేల టీంఎసీలు గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారని, 450 ఇండ్లు కొట్టుకుపోయాయని చెప్పారు. ‘ఇప్పటి వరకు ఆ డ్యాం కట్టారా?, బాధితులకు ఏం న్యాయం చేశారు?, ప్రాజెక్టు గేట్లకు గ్రీసు వేయలేని సీఎం 3 రాజధానులు కడతారా?’. అంటూ చంద్రబాబు విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed