- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను తలచుకుంటే YSR, JAGAN, SHARMILA రోడ్డెక్కేవారా?
- వైఎస్ షర్మిళ, విజయమ్మలు సైతం రోడ్‌షోలు నిర్వహించలేదా?
- వైసీపీ అరాచకం పరాకాష్టకు చేరింది
- నా నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకుంటారా?
- నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- కొంతమంది పోలీసులపై ప్రైవేట్‌కేసులు వేసి బోనెక్కిస్తా
- పెద్దిరెడ్డి! నేను తలచుకుంటే చిత్తూరులో తిరిగేవాడివా?
- - కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని...అన్ని రంగాల్లో ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. జగన్ సైకో పాలన పోవాలని వారంతా కోరుకుంటున్నారని అన్నారు. కుప్పంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో కూడా రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉండే తాను పర్యటించే సమయంలో ఒక డీఎస్పీ కూడా తనతో పాటు ఉండాలని, ఇక్కడ డీఎస్పీ ఎక్కడున్నాడో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశానని, కానీ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులతో ప్రస్తుతం పోరాడుతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో తననే తిరగనివ్వడం లేదంటే దుర్మార్గం ఎంతలా ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నా హయాంలోనే వైఎస్ఆర్, జగన్, షర్మిళలు పాదయాత్రలు చేయలేదా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండో రోజు ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతుంది. రెండో రోజు కూడా చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో చంద్రబాబు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పాదయాత్రలను ఏ ప్రభుత్వం కూడా అడ్డుకోలేదని చంద్రబాబు అన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందా అని నిలదీశారు. తాను సీఎంగా ఉన్నప్పుడే వైఎస్ఆర్, జగన్‌లు పాదయాత్రలు చేశారని.. వైఎస్ విజయమ్మ, షర్మిళలు రోడ్‌షోలు చేశారని గుర్తు చేశారు. వాళ్లకు పోలీసులతో ఎంతో భద్రత కల్పించానని, నాడు వారికి పోలీసులు ఎంతగానో సహకరించేలా ఆదేశాలిచ్చామని గుర్తుచేశారు. మా ప్రభుత్వం పోలీసుల సహకారం ఉంది కాబట్టే వైఎస్ జగన్ పాదయాత్ర చేశాడన్నారు. తమ ప్రభుత్వం సహకరించింది కాబట్టే జగన్ ప్రశాంతంగా పాదయాత్రను పూర్తి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు జీవో నెం.1 విడుదల చేసి తన యాత్రను అడ్డుకుంటారా అని చంద్రబాబు నిలదీశారు. ఏడుసార్లు గెలిచిన తనను సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లేందుకు కూడా అడ్డంకులు సృష్టిస్తారా అని పర్యటించారు. హత్యాయత్నం కేసులు పెట్టి తమ కార్యకర్తలను వేధిస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ ఉన్నా ప్రచార రథాన్ని పోలీసులు ఎందుకు తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌లో భయం, పిరికితనం పెరిగిపోయిందని, అందుకే అరాచకంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ప్రైవేట్ కేసులు వేస్తాం
పోలీస్ శాఖ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి కొంతమంది పోలీసు అధికారులు వత్తాసు పలకుతున్నారని చెప్పారు. జీవో నెంబర్ 1ను తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లారని....టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తు్న్నారని చెప్పారు. తనపై కూడా కేసు పెట్టుకోవాలన్నారు. తాము పోలీసు వ్యవస్థపైనే కేసులు పెడతామని, చట్టాన్ని అతిక్రమిస్తు్న్న కొందరు పోలీసులపై ప్రైవేట్ కేసులు వేసి బోనెక్కిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. కందుకూరు, గుంటూరు ఘటనలలో టీడీపీని బయటకు రానీయకుండా ఉండేందుకు కొందరు పోలీసులు కుట్రలు పన్నారని.. అలాంటి అస్త్రాన్ని నేడు కుప్పంలోనూ ప్రయోగిస్తు్న్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : Varla Ramaiah Letter: ఆ జీవో ప్రమాదకరం