Vande Bharat Train: తిరుపతికి ఇక 7 గంటలే..

by srinivas |   ( Updated:2023-03-25 13:57:42.0  )
Vande Bharat Train: తిరుపతికి ఇక 7 గంటలే..
X

దిశ, తిరుపతి: కేంద్ర రైల్వే శాఖ టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి గోవిందుడి చెంతకు వందే భారత్ రైలును నడపనుంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. ఏప్రిల్ నెలలో ఈ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తిరుపతికి 12 గంటల సమయం పడుతోంది. వందే భారత్ అందుబాటులోకి వస్తే తిరుపతి ప్రయాణం 7 గంటలకే పూర్తి అవుతుంది.

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులను వచ్చే నెలలో మోదీ ప్రారంభించేందుకు రానున్నట్లు సమాచారం. ఆ సమయంలోనే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వెళ్లే రూట్‌లోనే వందేభారత్‌ నడవనుంది. సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది. ఆ తర్వాత శావల్యపురం-ఒంగోలు రూట్ పూర్తయ్యాక అటు నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తిప్పనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక రైలు సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed