Tirupati: చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

by srinivas |
Tirupati: చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, పాకాల: తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరుగు రంగయ్యగారిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. రైతు భాస్కర్ పొలంలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. కాకి కలర్ ప్యాంటు, బ్లూ స్కై వైట్ చెక్ షర్టు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతి చెందిన వ్యక్తి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పాకాల పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.

Advertisement

Next Story