- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tirupati: చిట్టీ డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య

దిశ, తిరుపతి: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న దంపతుల తీరుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తిరుచానూరు పంచాయతీ ఎస్వీపీ కాలనీలో చోటు చేసుకుంది. నితిన్ సింగ్ అనే వ్యక్తి స్థానికంగా ప్రొవిజన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇంటి పరిసరాల్లో ఉంటున్న దంపతుల వద్ద చిట్టీలు వేశాడు. అయితే చిట్టీ గడువు ముగిసి మూడు ఏళ్లు అవుతోంది. అయినా తనకు డబ్బులు ఇవ్వకుండా దంపతులు తిప్పుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన నితిన్.. తన చావుకు చిట్టీ నిర్వహిస్తున్న దంపతులే కారణమంటూ లేఖ రాశారు. అనంతరం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. నితిన్ చావుకు కారణమైన చిట్టీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని తెలిపారు.