- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అడవిలోకి చొరబడుతున్న 13 మంది స్మగ్లర్లు అరెస్ట్
దిశ ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా కల్లూరు సమీపంలోని అడవుల్లోకి ఎర్రచందనం కోసం చొరబడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, వారి నుంచి గొడ్డళ్లు, రంపాలు, రెండు ఆటోలు, ఒక మోటారు సైకిల్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జి. బాలిరెడ్డి తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశంలో ఆర్ఐ(ఆపరేషన్స్) కే. సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు కేఎస్ కే. లింగాధర్, వై. విశ్వనాథ్, స్థానిక అటవీ శాఖ ఎఫ్ బీఓ పీ.శ్రీదేవి బృందం సోమవారం చిత్తూరు జిల్లా ఐరాల అటవీ ప్రాంతానికి చేరుకున్నారని చెప్పారు.
అక్కడ నిషేధిత అటవీ ప్రాంతం వద్ద అడవిలోకి చొరబడేందుకు రెండు ఆటోలు, ఒక మోటారు సైకిల్ పై కొంత మంది వ్యక్తులు దిగారని, వారిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టడంతో కొందరు పారిపోగా, 13 మందిని పట్టుకోగలిగారని వివరించారు. వారి నుంచి 4పిడిలేని ఇనుప గొడ్డళ్లు, బారిస, రంపపు చుట్టలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వారిలో 10 మంది తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు కల్లకరుచ్చి జిల్లాకు చెందిన వారు, మరో ఇద్దరు చిత్తూరు టవున్‌కి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించగా, సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.