AP News : చింతమనేని ప్రభాకర్ ఆలోచన భేష్

by M.Rajitha |
AP News : చింతమనేని ప్రభాకర్ ఆలోచన భేష్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా రాజకీయ నాయకులకు నిత్యం ఏదో ఒక సన్మానం జరుగుతూ.. శాలువాలు కప్పుతూ ఉంటారు. చాలామంది నాయకులు వాటిని పక్కన పడేస్తుంటారు. కాని ఏపీలోని ఓ ఎమ్మెల్యే శాలువలను పక్కన పడేయకుండా, వాటిని డ్రెస్సులుగా కుట్టించి పంచారు. ఏపీ(AP)లోని ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(MLA Chinthamaneni Prabhakar) ఈ వినూత్న ఆలోచన చేశారు. వివిధ సందర్భాల్లో తనకు సన్మానంగా వచ్చిన శాలువాలను పక్కన పడేయకుండా.. వాటిని గౌన్లుగా కుట్టించి విద్యార్థినిలకు పంచారు. ఒక్కో గౌనుకు రూ.450 ఖర్చు చేసి హాస్టళ్లు, స్కూళ్ళలో 250 మంది పేద విద్యార్థినిలకు వాటిని అందజేశారు. నిత్యం సన్మానాలు అందుకునే ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే.. ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడుతుందని చింతమనేని పేర్కొన్నారు.

Next Story

Most Viewed