- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ షాక్‌తో చిన్నారులైన అన్నాదమ్ములు మృతి
దిశ, కడప: చిన్నారులైన అన్నాదమ్ములు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చెన్నూరు మండలం ఖాదర్ ఖాన్ కొట్టాల గ్రామంలో చోటు చేసుకొంది. బాధితులు, చెన్నూరు పోలీసుల కథనం ప్రకారం.. ఖాదర్ ఖాన్ కొట్టాల గ్రామానికి చెందిన జ్యోతి, మోహన్ లకు శశాంక్ (12), మనోజ్ (4) సంతానం. మోహన్ బెల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు బెల్దారి పనులకు వెళ్లారు. అలాగే ఇంట్లో వున్న బంధువులు తమ ఇంటికి వచ్చిన బంధువులను బస్సు ఎక్కించేందుకు బస్టాప్‌కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో అన్నాదమ్ములు ఆడుకునేందుకు ఇంటి రేకుల మిద్దెపైకి వెళ్లారు. రేకుల మిద్దె ప్రక్కనే వెలుతున్న విద్యుత్ మెయిన్ లైన్ పొరపాటున శశాంక్ పట్టుకోవడంతో విద్యుత్ షాక్ గురయ్యాడు. వెంటనే అన్నను పట్టుకునేందుకు మనోజ్ ప్రయత్నం చేయడంతో మనోజ్ కు కూడ విద్యుత్ షాక్ గురయ్యాడు.
ఈ విషయామన్ని గమనించిన ప్రజలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బంధువులు ఇంటికి వచ్చి విద్యుత్ షాకు గురైన చిన్నారులను చూసి హతాశులయ్యారు. ఇద్దరు చిన్నారులను తెలుగు దేశంపార్టీ నాయకుడు మన్ మోహన్ రెడ్డిలు హుటా హుటిన కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ధృవీకరించారు. వున్న ఇరువురు కుమారులు ఒకే సంఘటనలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోధన ను గ్రామస్తులు సైతం కంట తడి పెట్టారు. సంఘటనా స్థలాన్ని కడప డీఎస్పీ బి వెంకటశివారెడ్డి, ఎస్.ఐ శ్రీనివాసులురెడ్డి పరిశీలించారు. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.