- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి రజిని రూ. 10 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి విడదల రజినిపై పసుమర్రు రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్‌కు పాల్పడినట్లు తెలిపారు. జగనన్న కాలనీ పేరుతో రైతుల నుంచి 160 ఎకరాలు తీసుకున్నారని, ఈ భూముల్లో రూ. 10 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. విడుదల రజినీ కాజేసిన డబ్బులను రికవరీ చేయాలని చిలకలూరి పేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు రైతులు ఫిర్యాదు చేశారు. రజినిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలు అతిపెద్ద కుంభకోణమని చెప్పారు. భూమి కొనుగోలు, మౌలికవసతుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అండతో వందల కోట్లు చేతులు మారాయన్నారు. జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పసుమర్రు రైతులకు న్యాయం చేస్తామని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.