రాజ్య సభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు సంచలన నిర్ణయం

by Satheesh |   ( Updated:2024-02-14 13:36:23.0  )
రాజ్య సభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్య సభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల చివర్లో మూడు స్థానాలకు జరగబోయే రాజ్య సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. ఈ మేరకు పోటీపై టీడీపీ నేతలకు బాబు క్లారిటీ ఇచ్చారు. కాగా, గత కొన్ని రోజులుగా బలం లేకపోయినప్పటికీ టీడీపీ రాజ్య ఎన్నికల్లో పోటీ చేస్తోందని వార్తలు వినిపించాయి. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ సైతం రాజ్య సభ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో రాజ్య సభ ఎన్నికల్లో పోటీపై తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. బలం లేకపోయినప్పటికీ ఎలా పోటీ చేస్తారని కన్ఫూజన్ నెలకొంది. దీంతో రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీ పోటీపై వస్తోన్న వార్తలకు తాజాగా బాబు చెక్ పెట్టారు. రాజ్య సభ ఎన్నికల బరిలో టీడీపీ ఉండటం లేదని ప్రకటించడంతో.. నేతల్లో నెలకొన్న అయోమయానికి ఫుల్ స్టాప్ పడింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్య సభ స్థానాలు ఖాళీ కానున్నాయి. సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్‌ల పదవి కాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. దీంతో ఈ మూడు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15 వరకు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కాగా.. ఫిబ్రవరి 27వ తేదీన మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలబలాల ప్రకారం మూడు స్థానాలు అధికార వైసీపీ దక్కనున్నాయి. సీఎం జగన్ ఇప్పటికే ముగ్గురు రాజ్య సభ అభ్యర్థులను ప్రకటించారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి, గొల్ల బాబారావులకు జగన్ పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ మేరకు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీకి 155 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి ఎన్నిక ఏక గ్రీవం కానుంది.

Read More..

Breaking: చంద్రబాబు అలా చేయడం వల్లే ఏపీకి రాజధాని లేదు..బొత్స

Advertisement

Next Story