- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు (గురువారం) టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. సెకండ్ లిస్ట్‌లో ఎంత మంది వీలైతే అంతమంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేస్తామని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ ఏయే స్థానాలలో పోటీ చేయాలో వారికి స్పష్టత ఉందని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లతో పాటు.. పలువురు ఎంపీ క్యాండిడేట్ల పేర్లను సైతం ప్రకటిస్తామని బాబు వెల్లడించారు. కాగా, టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 144 చోట్ల పోటీ చేస్తోంది.
25 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. పొత్తులో భాగంగా 17 ఎంపీ సీట్లలో టీడీపీ బరిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను ఇటీవల రిలీజ్ చేసింది. ఇందులో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 50 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బాబు.. ఎట్టకేలకు క్యాండిడేట్లను ఫైనల్ చేశారు. రేపు సెకండ్ లిస్ట్‌ను విడుదల చేయనున్నారు. టీడీపీ రెండవ జాబితా విడుదల నేపథ్యంలో ఆశవహులతో పాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ పార్టీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read More..
MPగా కేఏ పాల్ పోటీ.. పార్టీ చీఫ్‌కు బూస్టింగ్ ఇచ్చేలా బాబు మోహన్ క్లారిటీ