- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుంగనూరు బాలిక కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక దారుణ హత్యకు గురైన ఘటన ప్రస్తుతం రాష్టవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. చిన్నారి బాలిక తండ్రికి, ఓ మహిళకు మధ్యగల ఆర్థిక లావాదేవీల గొడవ బాలిక హత్యకు కారణమైంది. కాగా ఆదివారం బాలిక కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) ఫోన్లో పరామర్శించారు. అంతకు ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి స్వయంగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడుతూ.. ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను గుర్తించామని, అందులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
చిన్నారి బాలిక తండ్రి ఓ మహిళకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఆ మహిళా ఎంతకీ అప్పు తీర్చకపోవడంతో సదరు మహిళను తీవ్ర పదజాలంతో తిట్టాడు. కోపంతో రగిలిపోయిన ఆ మహిళ.. అతని కూతురును ఇంటికి పిలిచి, భోజనం పెట్టి, అనంతరం గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత శవాన్ని సమీపంలోని వాటర్ ట్యాంక్ లో పడేసి.. ప్రమాదం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది.