Nara Chandrababu Naidu : చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు

by Seetharam |   ( Updated:2023-11-01 05:40:17.0  )
Nara Chandrababu Naidu : చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన రద్దు అయ్యింది. కంటి సమస్యతో బాధపడుతున్న చంద్రబాబును వైద్య పరీక్షల నిమిత్తం వెంటనే హైదరాబాద్‌కు తీసుకురావాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో 53 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు మంగళవారం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే బుధవారం తిరుమలకు చంద్రబాబు వెళ్తారని ప్రచారం జరిగింది. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారని రాత్రికి తిరుమలలోనే బస చేసి గురువారం ఉదయం తిరుమల సంప్రదాయం ప్రకారం ఉదయం 9:30కు వరాహస్వామి వారిని దర్శించుకోనున్నారని ప్రచారం జరిగింది. అనంతరం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారి దర్శనం అనంతరం గురువారం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే వైద్యుల సూచన మేరకు చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.

Read More: మళ్లీ హస్తినకు నారా లోకేష్.. న్యాయవాదులతో సంప్రదింపులు

Advertisement

Next Story

Most Viewed