- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమాజ్ వినిపించగానే ప్రసంగం ఆపేసిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెదకూరపాడులో ప్రజాగళం సభ నిర్వహించారు. అయితే సభ జరుగుతుండగా నమాజ్ వినిపించింది. దీంతో చంద్రబాబు ప్రసంగం ఆపేశారు. నమాజ్ పూర్తయ్యే వరకు కూడా ఏమీ ప్రసంగించలేదు. ముస్లింల మత విశ్వాసాలను చంద్రబాబు గౌరవించారు. నమాజ్ అయిపోయిన తర్వాత ప్రసంగాన్ని కొనసాగించారు. ముస్లింల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. టీడీపీ హయాంలో ముస్లింలకు న్యాయం చేశామని చెప్పారు. ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇచ్చామన్నారు. 2014-2019 మధ్య ముస్లింలకు అన్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ కల్పిస్తామని.. ఆ బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్పారు. ముస్లిం మహిళలు, బాలికలను వైసీపీ నేతలు వేధించారని మండిపడ్డారు. జగన్ హయాంలో ముస్లింలపై చాలా దాడులు జరిగాయని చంద్రబాబు తెలిపారు.