విశాఖ డ్రగ్స్ వ్యవహారం.. ఆ ఎమ్మెల్యేపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-03-23 10:28:15.0  )
విశాఖ డ్రగ్స్ వ్యవహారం..  ఆ ఎమ్మెల్యేపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో 25 వేల కిలోల డ్రగ్స్‌ను సీపోర్టు అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ రవాణా వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. డ్రగ్స్ రవాణా వెనుక వైసీపీ నేతలు ఉన్నారని.. టీడీపీ ఆరోపిస్తోంది. అటు వైసీపీ కూడా టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ డ్రగ్స్ రవాణా వెనక కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీకి, ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందంటున్నారని.. దీనిపై కూడా సీబీఐ తేల్చాలని డిమాండ్ చేశారు. 25 వేల కిలోల డ్రై ఈస్ట్ పేరుతో జర్మనీ నుంచి కంటైనర్‌లో విశాఖపట్టణానికి డ్రగ్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. సీబీఐ వస్తే పోలీసులు జాప్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కూడా డ్రగ్స్, గంజాయిపై రివ్యూ చేయలేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాలకు తెరలేపి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని మండిపడ్డారు.

డ్రగ్స్‌పై పోరాటం చేస్తుంటే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డంగా దొరికిపోయి టీడీపీ నేతలు, పురంధేశ్వరిపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదంతా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్నారు. రూ.200, రూ.500 నోట్లను రద్దు చేసే పరిస్థితిని తీసుకురావాలని కోరారు. పెద్ద నోట్ల రద్దు కావాలనేదే తన ఆలోచన అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed