- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరోజు నన్ను అలిపిరిలో రక్షించింది ఆయనే.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగిన విషయం తెలిసిందే. పీపుల్స్‌వార్ గ్రూపు మందుపాతర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఈ దాడిని చంద్రబాబు మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిసారి ఇవాళ తిరుమల ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి తల కులదైవం అని అన్నారు. ఆనాడు అలిపిరిలో వెంకటేశ్వర స్వామే నన్ను కాపాడారు అని చెప్పారు. ఆయన కరుణ తమపై ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆయన వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందనీ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో అసమానతలు తొలగిపోవాలనేదే తన తాపత్రయం అన్నారు. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో.. పేదలకు అందించడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తిరుమల ఆలయాన్ని మళ్లీ అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని.. కానీ తప్పు చేసిన వదిలిపెట్టబోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా చూడాలనేది తన కోరిన అని అన్నారు.