- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిక్కుల్లో మాజీ మంత్రి కారుమూరి... రంగంలోకి సీఐడీ...!
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూటమి సర్కార్ ఫుల్‌గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు అక్రమాలపై విచారణ బాధ్యతను సీఐడీకి అప్పగించింది. వీటికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో జీవోలు జారీ కానున్నాయి. ఈ నేపథ్యంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2019-24 మధ్య జారీ చేసిన టీడీఆర్ బ్రాండ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు అనుమానిస్తోంది. దీంతో అంతర్గత విచారణ చేయించాలని నిర్ణయించింది.
2019-24 మధ్య అప్పటి ప్రభుత్వం టీడీఆర్ బాండ్లను జారీ చేసింది. అయితే ఈ బాండ్ల వ్యవహారంలో భారీగా కుంభకోణం జరిగినట్లు కూటమి ప్రభుత్వం భావించింది. తణుకులో జారీ చేసిన బాండ్ల వ్యవహారంలో రూ. 691 కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఇలానే జరిగి ఉంటుందని భావిస్తోంది. తణుకులో ఎకరం 55 లక్షలకు కొనుగోలు చేసి టీడీఆర్ బాండ్లలో రూ. 10 కోట్ల విలువ చూపినట్లు గుర్తించింది. స్థల సేకరణ సమయంలో ఎకరాల లెక్కన లెక్కల్లో చూపించి.. బాండ్ల జారీలో చదరపు గజాల్లో స్థలం లెక్కించారని తెలిసింది. దీంతో ఏసీబీ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ.. తణుకులో టీడీఆర్ బాండ్ల స్కాం జరిగినట్లు గుర్తించింది. తాజాగా ప్రభుత్వానికి ఏసీబీ నివేదికను అందజేశారు. ఈ కుంభకోణంపై సీఎం చంద్రబాబు దృష్టికి ఇప్పటికే నారాయణ తీసుకెళ్లారు. ఈ స్కాంపై లోతుగా విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ స్కాంను సీఐడీ విచారణకు ఇచ్చే అంశంపై పరిశీలిస్తున్నారు. సీఐడీ విచారణకు ఇస్తేనే అసలు సూత్రధారులు ఎవరో తెలుస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై గతంలోనే ఆరోపణలు రావడం, ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం న్యాయపరమైన అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముగ్గురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది.