- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అన్ని శాఖల్లోనూ భయంకర పరిస్థితులు’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత నష్టం చేసిందో ప్రజలకు తెలియాలని, అందుకే శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిపై మంగళవారం ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, బాధ్యత లేని పాలన వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. విద్యుత్‌తోనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయని, అలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు.
ఒక్క విద్యుత్ రంగమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్‌లలోనూ ఇదే పరిస్థితి దాపురించిందని అన్నారు. రాజకీయాలో కోసం భావి తరాల భవిష్యత్‌ను దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చామని, ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారన్నారు. సమర్థమైన పాలన ద్వారానే ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయన్నారు. మెరుగైన పాలన ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అన్ని వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టాలని, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని అన్నారు.