CM రేవంత్‌తో భేటీపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..?

by Satheesh |
CM రేవంత్‌తో భేటీపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: గత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై చంద్రబాబుపై స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో బాబు మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే నా విధానమని స్పష్టం చేశారు. రాష్ట్ర విజభన వేళ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సమన్యాయం చేయాలని చెప్పానని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఈ భేటీలో చర్చిస్తానని క్లారిటీ ఇచ్చారు. కాగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో.. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఐదు గ్రామాల విలీనం, కృష్ణ నది జలాల పంపకాలపై ప్రధాన చర్చ జరగనునట్లు టాక్.

Advertisement

Next Story