Chandrababu: దాన గుణంలో టాటాను మించినవారు లేరు

by Gantepaka Srikanth |
Chandrababu: దాన గుణంలో టాటాను మించినవారు లేరు
X

దిశ, వెబ్‌డెస్క్: రతన్ టాటా(Ratan Tata) అంటే వ్యక్తి కాదని.. ఒక శక్తి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం ముంబై వెళ్లి రతన్ టాటా భౌతికకాయానికి చంద్రబాబు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దాదాపు 100 దేశాల్లో టాటా తన సామ్రాజ్యాన్ని స్థాపించారని అన్నారు. ప్రపంచంలో టాటా గ్రూపు చేపట్టని ప్రాజెక్టే లేదని తెలిపారు. మంచి వ్యాపార వేత్తగానే కాకుండా.. దాన గుణంలోనూ తనను మించిన వారు లేరని రతన్ టాటా నిరూపించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కాగా, రతన్‌ టాటా ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. కాసేపట్లో రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేశారు.

Advertisement

Next Story