ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

by Mahesh |
ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బుడమేరు వాగు పొంగడం తో భారీ వరదలు వచ్చాయి. దీంతో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. అలాగే కొన్ని రోజులు తాము కష్టపడి సంపాదించుకున్న వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నటీలో తడిచిపోయాయి. దీంతో వరద బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సమస్యపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం.. ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్ అంశంపై చర్చ సామాజిక బాధ్యతతో కంపెనీలు ముందుకు రావాలని, ఆయా వస్తువుల స్పేర్‌పార్ట్స్ డిస్కౌంట్‌పై ఇవ్వాలని సీఎం సూచించారు. దీనిపై కంపెనీల వారీగా హైల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి.. అదనంగా టెక్నీషియన్లను నియమించుకోవాలని.. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed