- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఖబడ్దార్.. ఇక మీ ఆటలు సాగవు’.. YCP నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: అధికార వైసీపీ నేతలకు టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం కుప్పంలో పర్యటించిన బాబు.. ఈ సందర్భంగా టీడీపీ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఐదేళ్లు అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీయిజంతో రాజకీయం చేశారు.. ఇక నుండి పోలీసులు మీరు చెప్పినట్లు వినరు.. ఎన్నికల అధికారులు చెప్పినట్లే చేస్తారు.. ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరించారు. ఖబడ్దార్.. ఇకపై జాగ్రత్తగా ఉండండి.. ఎన్నికలను సజావుగా జరిగనివ్వండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వైసీసీ నేతలు నోరు విప్పితే అబద్దాలు.. అన్ని ఫేక్ వార్తలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవితంలో ఇలాంటి రాజకీయాన్ని ఏనాడు చూడలేదని బాధపడ్డారు.
కొందరు కులాలు, మతాలు చూసి ఎన్నికల్లో పోటీ చేస్తారు.. కానీ పేదలు, మంచివాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ నేను పోటీ చేస్తానని అన్నారు. పేదలే నా మతం, నా కులమని బాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు ఐదేళ్లలో ఎన్నో హింసా రాజకీయాలు చేశారు.. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనను అంతమొందించి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు. లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పంలో తనను గెలిపించాలని ఈ సందర్భంగా బాబు విజ్ఞప్తి చేశారు.
Read More..
వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరిన నంద్యాల జెడ్పీటీసీ