- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ఎన్నికలు పెట్టినా సిద్ధమే: ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ముందస్తు ఎన్నికలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రేపు ఎన్నికలు పెట్టిన తాము సిద్ధమేనని.. ముందస్తుకు టీడీపీ సిద్ధంగా లేదని సీఎం జగన్ భావిస్తే అది ఆయన పగటికలే అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తాము సిద్ధమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
టీడీపీ సభ్యుల బలంతోనే ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకున్నామని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రజలు ఇచ్చింది షాక్ ట్రీట్ మెంట్ మాత్రమేనని.. వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో ప్రజలు శాశ్వత చికిత్స చేస్తారని అన్నారు. కాగా, ఏపీలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోన్న వేళ.. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.