చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు

by Satheesh |   ( Updated:2024-03-20 09:47:50.0  )
చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూల్ జిల్లాలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు అని.. పొత్తులు ఉంటేనే ఆయన పోటీ చేయగలడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రల్లా నిలబడ్డాయని కూటమిపై సెటైర్ వేశారు. అందితే జట్టు.. లేకపోతే కాళ్లు అనేది చంద్రబాబు నైజమని విమర్శించారు. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు ముందుగా ఊహించిందేనని అన్నారు. ఎంత మంది కలిసి వచ్చిన.. గతంలో కంటే ఈ సారి ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. కర్నూల్‌ను న్యాయ రాజధాని చేస్తామని ప్రకటించారు.

Read More..

Big Breaking: లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు.. ఏం నిర్ధారించారంటే?

Advertisement

Next Story