- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
క్యాష్ పిటిషన్‌కు చంద్రబాబు అనర్హుడు : ముకుల్ రోహత్గీ
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్‌లో పథకం ప్రకారమే స్కామ్ జరిగింది అని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ నేరంలో భాగస్వామ్యం అయ్యారని... పథకం ప్రకారం ఈ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు క్యాష్ పిటిషన్‌కు అనర్హుడని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని...కేసు నమోదైన తర్వాత రెండేళ్లపాటు సాక్ష్యాధారాలు సేకరించాకే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వెల్లడించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రిమాండ్‌లో ఉంది కేవలం పది రోజులు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబుకు సంబంధించి క్యాష్ పిటిషన్‌ను స్వీకరించాల్సిన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ స్కామ్ కేసుకు సంబంధించి 900 పేజీల డాక్యుమెంట్‌ను కోర్టులో హాజరుపరిచామని దీనిపూ పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది అని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు.
కేబినెట్ ఆమోదం లేదు
సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జీషీట్లు అయినా వేయవచ్చుని, ఎంతమంది సాక్ష్యులను అయినా కేసులలో చేర్చవచ్చునని ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రూ.3వేల కోట్లు ఎక్కడకు వెళ్లాయో దానిపై విచారణ చేయాల్సి ఉందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీల జాడ తీస్తున్నామని చెప్పుకొచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఎలా వెళ్లిందో తెలియాల్సి ఉందని న్యాయవాది అన్నారు. అన్ని బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారు అని కోర్టులో వాదనలు వినిపించారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదమే లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు అని న్నారు. ప్రభుత్వ ధనాన్ని లూఠీ చేశారు అని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి సంతకం చేసినంత మాత్రాన ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. దీనిని ప్రజా విధిగా ఎలా భావిస్తారని ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. పచ్చిగా చెప్పాలంటే ప్రభుత్వ ధనాన్ని లూఠీ చేశారు అని ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు.