అరకు అసెంబ్లీ TDP అభ్యర్థి ఫిక్స్.. ‘రా కదలి రా’ సభలోనే ప్రకటించిన చంద్రబాబు

by Satheesh |
అరకు అసెంబ్లీ TDP అభ్యర్థి ఫిక్స్.. ‘రా కదలి రా’ సభలోనే ప్రకటించిన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యహరిస్తూనే.. మరో వైపు ఇప్పటి నుండి ప్రచారంలో జోరు పెంచారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే.. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయినింగ్ షురూ చేశారు. ‘రా కదలి రా’ పేరుతో మాజీ సీఎం ప్రచారం హోరెత్తిస్తున్నారు. టీడీపీ కేడర్‌లో నయా జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అరకు నియోజకవర్గంలో రా కదలి రా సభ నిర్వహించారు. ఈ సభకు చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు.. జగన్ సర్కార్‌పై నిప్పలు చెరిగారు. గిరిజనులకు సీఎం జగన్ తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.

మరోవైపు ఈ సభలో చంద్రబాబు అరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అరుకు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరుఫున సివ్వేరి దొన్ను దొర బరిలోకి దిగుతాడని బాబు ఎనౌన్స్ చేశారు. రా కదలి రా సభ స్టేజ్‌పైనే చంద్రబాబు దొన్ను దొర పేరును ప్రకటించారు. దీంతో అరకు టీడీపీ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే, వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో జనసేన, టీడీపీ ఉమ్మడిగా కసరత్తు చేస్తున్నాయి. ఇదిలా ఉండగానే చంద్రబాబు మాత్రం అరకు అభ్యర్థిని ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. పొత్తులో భాగంగా అరకు నుండి టీడీపీ క్యాండిడేట్ రేస్‌లో నిలవనున్నట్లు చంద్రబాబు ప్రకటనతో స్పష్టం అయ్యింది.

Read More..

అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే.. : చంద్రబాబు

Advertisement

Next Story

Most Viewed