ప్రలోభాలుపెట్టడంలో చంద్రబాబు దిట్ట.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

by Hamsa |   ( Updated:2023-03-24 08:34:13.0  )
ప్రలోభాలుపెట్టడంలో చంద్రబాబు దిట్ట.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్‌ ఆడటంలో దిట్ట అని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం గెలవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్‌కు డబ్బులు ఇస్తూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయారని గుర్తు చేశారు. ఆ ఓటుకు నోటు కేసులో ఎక్కడ దొరుక్కుపోతామనే భయంతోనే హైదరాబాద్ వదిలేసి రాష్ట్రానికి వచ్చేశారని వల్లభనేని వంశీ మోహన్ ఆరోపించారు. గన్నవరంలో శుక్రవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మీడియాతో మాట్లాడారు. ఇక పోతే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చారు.

దొంగలు దొరికిపోయారు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడం వెనుక మైండ్ గేమ్ పాలిటిక్స్, అభద్రత భావం పని చేశాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే భావనలో ఉన్న నలుగురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని చెప్పుకొచ్చారు. ఆ ఓటు వేసిన వాళ్లు ఎవరో కూడా తెలిసిపోయిందని చెప్పుకొచ్చారు. ఓట్లను బట్టి ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలు ఎవరో అధిష్టానం గుర్తించింది అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ టికెట్ దక్కదని తెలిసి ఇలా డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. వైఎస్ జగన్ టికెట్ ఇవ్వరని కనీసం ఈ డబ్బుతో అయినా సర్ధుకుపోదామనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రలోభాలకు లొంగి ఓటు వేశారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆరోపించారు.

బాలయ్యపై సెటైర్లు

వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో తిరుగుబాటు మెుదలైందన్న హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా వేరు రాజకీయం వేరన్నారు. బాలకృష్ణ చెప్పేవన్నీ సినిమా డైలాగులేనని విమర్శించారు. అసలు సినిమాల్లో ఒరిజినల్ అనేది ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. జుట్టు దగ్గర నుంచి మీసం, బొచ్చు, రంగు ఇవన్నీ విగ్‌లేనని చెప్పుకొచ్చారు. అసలు సినిమా వాళ్ళు చెప్పే మాటలకు ఏం ఉంటుంది అని వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు.

Read more:

జీవోను రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యుల నిరసన.. 10 మంది సస్పెన్షన్

Advertisement

Next Story

Most Viewed