కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు

by srinivas |
కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
X

దివ, వెబ్ డెస్క్: భారతీయల రూపురేఖలను వివిధ దేశాల వారితో పోల్చిన శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదని తెలిపారు. భారత దేశమంటే భిన్నత్వంలో ఏకత్వమని చంద్రబాబు గుర్తు చేశారు. భారత దేశ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ నిలబెట్టాలని సూచించారు. దక్షిణ భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, మంచి సంస్కృతి ఉందన్నారు. ఆఫ్రికన్‌లకు సొంత గుర్తింపు ఉందని తెలిపారు. వ్యక్తుల గుర్తింపును శ్యామ్ పిట్రోడా తగ్గించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయని, భారతీయులుగా అందరం కలిసే ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా ఓ ఇంగ్లీష్ వార్త పత్రికలో శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ భారతీయుల రూపురేఖలపై అవమానకరంగా మాట్టాడారు. వివిధ దేశాల వారితో భారతీయులను పోల్చారు. ఉత్తర భారతీయులను శ్వేతజాయులతో పోల్చారు. పశ్చిమ భారతీయులను అరబ్బులతో, తూర్పు భారతీయులను చైనీయులతో, దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోల్చారు. దీంతో శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై భారతీయులందరూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ మిత్రాలు సైతం శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను ఖండించాయి. ఇక బీజేపీ నేతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed