చంద్రబాబు అరెస్ట్.. వచ్చే ఎన్నికల్లో సీఎం ఆయనే అంటూ బాంబ్ పేల్చిన వేణు స్వామి!

by Hamsa |   ( Updated:2023-10-14 06:54:51.0  )
చంద్రబాబు అరెస్ట్.. వచ్చే ఎన్నికల్లో సీఎం ఆయనే అంటూ బాంబ్ పేల్చిన వేణు స్వామి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పలువురు ప్రముఖుల జాతకాలు చెబుతూ బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. సమంత, నాగచైతన్య విడాకుల తీసుకుంటారని ముందుగానే చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించారు. ప్రభాస్ ఆదిపురుష్ ఫ్లాప్ అవుతుందని.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని ముందే చెప్పి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కేసీఆర్, ఏపీలో జగన్ సీఎంలు అవుతారని గతంలోనే చెప్పారు.

తాజాగా, వేణుస్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయనను చుట్టుముట్టిన మీడియా.. ఏపీకి కాబోయే సీఎం ఎవరంటూ ప్రశ్నించారు. తాను గతంలోనే దీనిపై మాట్లాడానని.. అదే జరుగుతుందని వేణు స్వామి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కదా అని అడగ్గా.. ఎన్ని జరిగినా కూడా గతంలో తాను చెప్పిన వారే సీఎం అవుతారని వేణు స్వామి మరోసారి చెప్పుకొచ్చారు. పేర్లు చెప్పమని అడగ్గా.. దేవుని సన్నిధిలో ఉన్నామని.. రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడటం సరైంది కాదని వేణు స్వామి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ విషయం గురించి తెలిసిన వారు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కాబట్టి జగన్ సీఎం అవుతారని వేణు స్వామి అన్నారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed