Ap News: ఏపీలో పది లక్షల ఫేక్ ఓట్ల తొలగింపు.. ఈసీ విచారణలో సంచలన విషయాలు

by srinivas |   ( Updated:2023-06-19 16:49:44.0  )
Ap News: ఏపీలో పది లక్షల ఫేక్ ఓట్ల తొలగింపు.. ఈసీ విచారణలో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పది లక్షల ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర సీఈవో ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. వాటి తొలగింపుపై ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. అందుకే వాటిని ఫేక్ ఓట్లుగా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. గతంలో ఫేక్ ఓట్ల ఉన్నాయన్న ఫిర్యాదులతో ఆ ఓట్లను గుర్తించి తొలగించామన్నారు. సాధారణంలో ఓటర్లలో 1 శాతం పెరుగుదల ఉంటుందని, కానీ 3-4 శాతం మేర పెరుగుదల ఉండటాన్ని గమనించామని తెలిపారు. ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్‌తో ఒకే ఫొటోతో ఉన్న 15 లక్షల మంది ఓటర్లు గుర్తించామన్నారు. 2022లో పది లక్షల మందిని గుర్తించి ఓటరు జాబితా నుంచి తీసివేశామని స్పష్టం చేశారు.


రాష్ట్రంలో 1.62 కోట్ల ఇంటి నెంబర్లున్నాయని, వాటిలో 3.98 కోట్ల మంది ఓటు నమోదు చేసుకున్నారని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. 2100 ఇళ్ల నెంబర్లపై 50 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని, అక్కడ తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అక్టోబర్ 15 తేదీ వరకు తదుపరి ఓట్ల లిస్టును రెడీ చేస్తామన్నారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని ముకేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed