ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. కేంద్ర ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం..!

by Satheesh |
ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. కేంద్ర ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు, తర్వాత రోజు హింతసాత్మక ఘటనలు చెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని చంద్రగిరి, పల్నాడు, మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, రెంటచింతలతో పాటు పలు ప్రాంతాల్లో అధికార వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలు అదుపు తప్పడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు స్టేట్ సీఎస్, డీజేపీలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వేళ చెలరేగిన అల్లర్లపై ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ వేగవంతం చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టారు. ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడానికి ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను పరిశీలీస్తున్నారు. ఐఎఎస్‌లు రవిప్రకాష్, వినీత్ బ్రిజ్‌లాల్, పీహెచ్‌డీ రామకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ చేయనుంది. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన ప్రతి కేసును పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్‌లను పరిశీలించడంతో పాటు అదనపు సెక్షన్లు చేర్చడంపై ఈ విచారణ బృందం నిర్ణయం తీసుకోనుంది. రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సిట్ రిపోర్ట్ ఇవ్వనుంది.

Read More..

దేశంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన రాష్ట్రమిదే: ECI



Next Story