- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల
దిశ, వెబ్ డెస్క్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాబోయే గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. పుష్కరాల సన్నాహాల దిశగా టూరిజం శాఖ అధికారులు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ది ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపు చేస్తోంది.
కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి కేటాయింపుల్లో కొంత ప్రాధాన్యతనిచ్చిన కేంద్రం సీఎం చంద్రబాబు కోరిన మేరకు నిధుల మంజూరులో సానుకూలంగా స్పందిస్తు వస్తుంది. ఇప్పటికే ఏపీకి పలు కొత్త రైల్వే, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టు ప్రాజెక్టులను, పీఎం అవాస్ యోజన ఇండ్లను మంజూరు చేసింది. కాగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా ఏపీకి 100కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణ గోదావరి పుష్కరాలకు ఎమైనా నిధులు మంజూరు చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.