ఏపీకి గుడ్ న్యూస్.. రాజధానికి రూ. 15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం

by srinivas |
ఏపీకి గుడ్ న్యూస్.. రాజధానికి రూ. 15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. బిహార్, జార్ఖండ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాల్లోనూ ఏపీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాయలసీమతో పాటు ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తామన్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అందిస్తామని చెప్పారు. అమరాతవతి నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అవసరాన్ని ఇంకా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా నిధులు సమకూర్చునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామిక కారిడర్‌కు నిధులు కేటాయిస్తామన్నారు. ఏపీ విభజన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 500 పరిశ్రమల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి, రైతులకు జీవనాడి అని చెప్పారు. దేశ ఆహార భద్రతకు పోలవరం చాలా ప్రధానమైందని నిర్మలా సీతారామన్ తెలిపారు.



Next Story