- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CBI: భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి ముగిసిన విచారణ... అవినాశ్‌రెడ్డికి కంటిన్యూ
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డికి విచారణ కొనసాగుతోంది. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ ముగిసింది. దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డిని దాదాపు 6 గంటలకు పైగా లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు. సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురినీ విచారించారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది. దీంతో లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇచ్చి విచారించారు. కాగా ఇప్పటివరకు నాలుగు సార్లు విచారణ జరిగినప్పటికీ ఎంపీ అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. దీంతో ఈనెల 25 వరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు.
కాగా కస్టడీకి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి
అయితే వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులుగా రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు వీరిని కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలతో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. చంచల్ గూడ జైలు నుంచి నేరుగా సీబీఐ కార్యాలయానికి తరలించి విచారించారు.
ఇవి కూడా చదవండి: CBI: ఇవాళ్టికి ముగిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ