Viveka Case: ఉదయ్ కుమార్‌ రిమాండ్ పొడిగింపు

by srinivas |   ( Updated:2023-04-26 15:19:00.0  )
Viveka Case: ఉదయ్ కుమార్‌ రిమాండ్ పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. మరో 14 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని నాంపల్లి సీబీఐ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఉదయ్ రిమాండ్‌ను పొడిగిస్తూ సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది.

కాగా వైఎస్ వివేకా హత్యకు సంబంధించి కీలకమైన సాక్షాలను తారుమారు చేశారనే అభియోగాలు ఉదయ్ కుమార్ రెడ్డిపై ఉన్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి. దీంతో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన సీబీఐ కస్టడీకి తీసుకుని విచారించారు.

ఇవి కూడా చదవండి : Viveka Case: ప్రత్యక్ష సాక్షి ఇనాయతుల్లాను విచారిస్తున్న సీబీఐ

Advertisement

Next Story