- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత ఐదేళ్లలో MPs, MLAs పై CBI కేసులు.. టాప్‌లో తెలుగు రాష్ట్రం
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సీబీఐ కేసులపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌కు కీలక విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే ఏ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఎన్ని సీబీఐ కేసులు నమోదయ్యయని పార్లమెంట్‌కు తెలియజేశారు. గత ఐదేళ్లలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభలపై 56 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని, 22 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి దర్యాప్తును పూర్తి చేసిందని సభలో వెల్లడించారు. కాగా, కేసుల్లో ఏపీలో అత్యధికంగా నమోదయ్యాయి. ఐదేళ్లలో ఏపీలో 10 సీబీఐ కేసులు నమోదైనట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 5 సీబీఐ కేసులు అయ్యాయని వెల్లడించారు. ఆ తర్వాత తమిళనాడులో 4, మణిపూర్‌లో 3, ఢిల్లీలో 3, బీహార్ 3, జమ్మూ కశ్మీర్‌లో2, కర్ణాటకలో 2, హర్యానాలో 1, మేఘాలయలో 1, చత్తీస్ గఢ్‌లో 1, ఉత్తరాఖండ్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 1, మహారాష్ట్రలో ఒకటి ఇలా రాష్ట్రాల వారిగా నమోదైనట్టు పేర్కొన్నారు.
Also Read....
- Tags
- cbi