కొడాలి నానిపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
కొడాలి నానిపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో కొడాలి నానికి కీలక విషయాలు తెలుసన్నారు. సీబీఐ అధికారులు ఈ కేసులో కొడాలి నానిని విచారించాలని డిమాండ్ చేశారు.

నానికి నాలుగు తగిలిస్తే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. వైఎస్ కుటుంబంలో కొడాలినాని చిచ్చు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసమే నాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గతి లేక కొడాలి నాని వైసీపీలో చేరాడన్నారు.

Next Story

Most Viewed