భూకబ్జాలకు పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కేశినేని నాని.. బుద్దా వెంకన్న

by Indraja |
భూకబ్జాలకు పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కేశినేని నాని.. బుద్దా వెంకన్న
X

దిశ వెబ్ డెస్క్: టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరిన కేశినేని నాని పుట్టిన రోజు తేదీ జనవరి 22. ఈ నేపధ్యంలో మీడియాతో మాట్లాడిన ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధా వెంకన్న కేశినేని నాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానికి తాను బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నట్లు పేర్కున్నారు. కేశినేని నాని బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరని మండిపడ్డారు. అసలు 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కేశినేని నాని చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఇక కేశినేని నాని అప్పులు లెక్కలేనన్ని అని ఎద్దేవ చేశారు. ఇక నాని ఇంటి పేరులో కే అంటే కేశినేని కాదు కోవర్టు పేర్కొన్నారు. నిన్నటి వరకు చంద్రబాబు అనుచరుడైన నాని ఈ రోజు దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు అని మండిపడ్డారు. నాని చెయ్యని అవినీతి లేదని.. దొంగ రసీదు బుక్కులు చూపి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలుఎగనామం పెట్టారని ఆరోపించారు.

100 రూపాయలు విలువైన బస్సు టికెట్ ను 500 వందలకు విక్రయించి ప్రజలను మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే ఒక నంబరు ప్లేటు మీద అనేక బస్సులు తిప్పిన అవినీతిపరుడు కోవర్టు నాని అని బుద్ధా వెంకన్న కేశినేని నాని పై ఆరోపణల వర్షం కురిపించారు. ఇక నాని భూకబ్జాల గురించి చెప్పాల్సిన పని లేదన్న ఆయన.. విజయవాడ నగరంలో భూకబ్జాలకు పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కోవర్టు నాని అని విమర్శించారు.

అందుకే అవినీతి పరుడైన కేశినేని నానిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మెడబట్టి గెంటాడు అని పేర్కొన్నారు. బాలయోగి ఆస్తులు కాజేసింది ఎవరని చిన్న పిల్లవాడిని అడిగిన కేశినేని నాని పేరు చెప్తాడని మండిపడ్డారు. దళితుల ఆస్తులు కాజేసి.. దళితుల అభివృద్ధి కోసం పాటుబడిన మహనీయులు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏ మోహం పెట్టుకుని వెళ్లవు నాని అని ప్రశించారు బుద్ధా వెంకన్న.

Advertisement

Next Story