AP News: రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం.. జగన్ పై బుచ్చి రాంప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
AP News: రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం.. జగన్ పై బుచ్చి రాంప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటన పై రాష్ట్రంలో మంత్రులు, అధికారులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ(TDP) బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ నేడు(ఆదివారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో సరైన నాణ్యత పాటించలేదని విమర్శించారు.

జగన్ ప్రభుత్వంలోని వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని.. చివరకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదల్లేదని మండిపడ్డారు. తిరుమల లడ్డూలో నాణ్యత(Quality) లేదని తాము గతంలో చాలా సార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీకుసువచ్చామని గుర్తుచేశారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు(Animal Fat) పదార్థాలు కలిశాయని సీఎం చంద్రబాబు చెబితే వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తారా? అని ప్రశ్నించారు. పరమ పవిత్రతను సంతరించుకున్న తిరుమల ఆలయాన్ని అపవిత్రం చేశారన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన వారు ఇంటికొచ్చే దాకా నాన్ వెజ్ తినరు. కానీ వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తినిపించి నాన్ వెజ్(Non-Veg) తినేలా చేశారని ఫైరయ్యారు.

పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుస్తున్నాయని చంద్రబాబు చెప్పినప్పుడు విని బాధపడ్డానని తెలిపారు. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరని అందరికీ తెలుసు. జంతు కొవ్వు కలిపిన నెయ్యితో తయారైన లడ్డూలను తిన్నామని తెలిస్తే.. పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలియక తప్పు చేస్తే ఏ విధంగా ఆ తప్పును సరి చేసుకోవచ్చో ఆగమ శాస్త్రం తెలిసిన వారిని అడగాలి అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలు నాణ్యతగా ఉండటం చూస్తున్నామని బుచ్చిరాం ప్రసాద్ పేర్కొన్నారు.

Next Story