- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: వైసీపీ అధికారం కోల్పోయింది ఆ ఎఫెక్ట్‌తోనే : ఉండవల్లి అరుణ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడానికి గల కారణాలపై చాలామంది రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు. ఆ భారం బడుగు, బలహీనవర్గాలపై పడిందని స్పష్టం చేశారు. ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడం జగన్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ పొత్తే డెడ్లీ కాంబినేషన్ అని, కూటమిలో బీజేపీ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేదని అన్నారు. టీడీపీ కూటమి విజయంతోనే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు సువర్ణావకాశం వచ్చిందని అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కూటమి ఎంపీలు, ఎమ్మెల్యే కృషి చేయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు, పోలవరం లాంటి కిష్టమైన వాటిపై కూటమి దృష్టి పెట్టాలని సాధించాలని అరుణ కుమార్ సూచించారు.
Also Read...
BREAKING: మాజీ సీఎం జగన్‌కు క్లాస్ పీకిన ఉండవల్లి అరుణ కుమార్.. మొదట ఆ పని చేయండని సలహా