BREAKING: శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. గేట్లలో తలెత్తిన సాంకేతిక సమస్య

by Shiva |
BREAKING: శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. గేట్లలో తలెత్తిన సాంకేతిక సమస్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి భారీ స్థాయిలో వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే దిగువన నాగర్జున‌ సాగర్‌‌కు నీటిని విడుదల చేసేందుకు గేట్ల హైట్ పెంచుతుండగా.. 2, 3 గేట్ల ప్యానల్‌లోని బ్రేక్ కాయిల్స్‌పై ఒత్తిడి పడి పూర్తిగా కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్యామ్ అధికారులు బ్రేక్ కాయిల్స్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అయితే జలాశయానికి ఇన్ ఫ్లోగా 3,26,481 క్యూసెక్కులు రాగా జలాశయం రెండు రేడియల్ క్రెస్ట్ గేట్లు నుంచి కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కి జలాశయం నుంచి మొత్తం ఔట్ ఫ్లోగా 3,80,499 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి మట్టం 885.00 అడుగులు చేరింది. మరోవైపు జలాశయం నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 214.8870 టీఎంసీలకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed