- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్!
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో పోలింగ్ నుంచి మొదలైన దమనకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్ల పై దాడికి దిగారు. అయితే, ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు సూర్యముని అనుచచరులు వైసీపీ ఏజెంట్లపై తిరగబడ్డారు. ఈ విషయంలో పెద్దారెడ్డి చెవిలో పడటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. మా వర్గీయులనే ప్రశ్నిస్తారా అంటూ.. తన అనుచరులతో కలిసి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల వారి చెరదగొట్టారు. ఈ అల్లర్లలో పట్టణ సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అల్లర్లు కారణమైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంసకాండను సృష్టించిన విషయం తెలిసిందే.