BREAKING : మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు

by Rajesh |   ( Updated:2024-07-12 07:45:21.0  )
BREAKING : మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో ఆర్ఆర్ఆర్ తెలిపారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ ఏ3గా ఉన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను పోలీసులు చేర్చారు.

Advertisement

Next Story

Most Viewed