ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విన్.. తొలి ప్రసంగంలో మోడీ నోట చంద్రబాబు ప్రస్తావన

by srinivas |   ( Updated:2025-02-08 15:03:29.0  )
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విన్.. తొలి ప్రసంగంలో మోడీ నోట చంద్రబాబు ప్రస్తావన
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ(Delhi) ఎన్నికల్లో బీజేపీ(Bjp) ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలున్న దేశ రాజధానిలో ఈ నెల 5న ఎన్నికల పోలింగ్ జరిగింది. శనివారం ఫలితాలు విడుదల అయ్యాయి. బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. 48 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. 22 చోట్ల ఆప్(AAP) విజయం సాధించింది. దీంతో ఢిల్లీ ప్రజలనుద్దేశించి బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఢిల్లీని వికసిత్ రాజధాని(Vikasit capital)గా మారుస్తామని హామీ ఇచ్చారు.

ఇక బీజేపీ భాగస్వామ్య పక్షాలపై ప్రధాని మోడీ మాట్లాడుతూ ఏపీ ప్రస్తావనను గుర్తు చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారని ఆయన తెలిపారు. బిహార్‌లో నితీశ్ కూటమిపై ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. ఎన్డీయే అంటే సుపరిపానలకు నిర్వచనమని మోడీ అభివర్ణించారు. తాను హామీ ఇచ్చానంటే అది కచ్చితంగా నెరవేరుతుందని చెప్పారు. షార్ట్ కట్ రాజకీయాలకు రాజధాని ప్రజలు షాకిచ్చారని తెలిపారు. తమ పని తీరు చూసే బీజేపీకి అధికారం కట్టబెట్టారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed