మమ్మల్ని ఎదగనివ్వడంలేదు... అది మాత్రం ఎప్పటికీ ఫలించదు: Somu Veerraju

by srinivas |   ( Updated:2023-03-22 16:30:38.0  )
మమ్మల్ని ఎదగనివ్వడంలేదు... అది మాత్రం ఎప్పటికీ ఫలించదు: Somu Veerraju
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంతో ఆలోచించుకోండని ఆయన వ్యాఖ్యానించారు. మోదీని పొడుగుతారని.. కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీని ఎదగనివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీజేపీ-జనసేన విడిపోవాలన్నది కొందరి కోరిక. చిన్న మాట పట్టుకుని ఏదేదో ఊహించుకుంటున్నారు. ఆ కొందరి కోరిక ఎప్పటికీ ఫలించదు.’ అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రం నిధులపై చార్జి‌షీట్ చేస్తామని ఆయన తెలిపారు. అమరావతే రాజధాని తాము తొలి నుంచి చెబుతున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. రాజధాని అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు బీజేపీ ఇచ్చిందన్నారు. రాజధాని అమరావతి అని ఎన్నికల ముందు జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడేమో మడమ తిప్పి విశాఖ పారిపోతున్నారని సోము వీర్రాజు విమర్శించారు.

ఇవి కూడా చదవండి : అభివృద్ధి, అవినీతిపై ప్రమాణానికి సిద్ధమా..? వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత సవాల్

Advertisement

Next Story

Most Viewed